Drama Org.at Hyderabad - హైదరాబాద్ డ్రామా సంస్థలు »
Kinnera Sri Khara Nama Ugadi Puraskar Awards Presented by Ex CM Dr Rosaiah కిన్నెర శ్రీఖర నామ ఉగాది పురస్కారాలను ప్రదానం చేసిన మాజీ ముఖ్య మంత్రి డా రోశయ్య





Content Text Back to Menu
Kinnera Sri- Khara Nama Ugadi Puraskar Awards at Ravindra Bharathi on 1st April 2011  
కిన్నెర – శ్రీఖర నామ ఉగాది పురస్కారాల ప్రదానం 1 ఏఫ్రిల్ 2011న రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది


 
కిన్నెర – శ్రీఖర నామ ఉగాది పురస్కారాల ప్రదానం రవీంద్రభారతి వేదికపై 1 ఏఫ్రిల్ 2011న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా.కొణిజేటి రోశయ్య హాజరయ్యారు. ప్రారంభోపన్యాసాన్ని జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి ప్రారంభించారు.అంతర్జాతీయ ఖ్యాతిగడించిన భాగ్యనగరానికి మరింత శోభను చేకూర్చేలా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర సాంస్కృతిక మండలి ఛైర్మన్ ఆర్వీ రమణమూర్తి ఈ సందర్భంగా తెలిపారు.

సాహిత్య రంగం నుంచి కవితాప్రసాద్, నృత్య రంగం నుంచి శ్రీ వేదాంతం రాధేశ్యాం, నాటక రంగం నుంచి ఎం.ఎస్.శకుంతలాదేవి, పత్రికా రంగం నుంచి డాక్టర్.కె.శ్రీనివాస్, వైద్య రంగం నుంచి డాక్టర్ తాతపూడి రవిరాజు, ఉద్యోగ రంగం నుంచి డాక్టర్ ఆర్జాశ్రీకాంత్, విద్యా రంగం నుంచి ప్రొఫెసర్ ఆర్.వి.రాజకుమార్, బ్యాంకింగ్ రంగం నుంచి డి.విరించి, ఆర్ధిక రంగం నుంచి కె.నరసింహమూర్తి, ఇంద్రజాలం నుంచి చొక్కాపు వెంకట రమణ, పబ్లికేషన్స్ నుంచి గాజుల సత్యనారాయణలకు కిన్నెర – శ్రీఖర నామ ఉగాది పురస్కారాలను మాజీ ముఖ్య మంత్రి రోశయ్య ప్రదానం చేశారు.

పురస్కారాలు బాధ్యతల్ని పెంచుతాయని ఈ సందర్భంగా రోశయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా కిన్నెర రఘురామ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ మూర్తి, సాధన నరసింహాచార్య, డా.తిరుమల శ్రీనివాసాచార్య, డా.ద్వా.నా.శాస్త్రీ, డా.వాణిదేవి, హరినాథ్, డా.జే.చెన్నయ్, ఎస్వీ రామారావు తదితరులు పాల్గొన్నారు.       

 
Content Photo Gallery Back to Menu
Content Youtube Links Back to Menu
Own Videos Back to Menu
No videos