|
|
Telugu Nataka Samithi ‘Vashikaranam Comedy Drama’ played at AG Office on 30th July 2012 ఏజీ ఆఫీసులో జరిగిన ‘వశీకరణం హాస్యనాటిక’
|
|
||||
Telugu Nataka Samithi ‘Vashikaranam Comedy Drama’ played at AG Office on 30th July 2012
ఏజీ ఆఫీసులో జరిగిన ‘వశీకరణం హాస్యనాటిక’
తెలుగు నాటక సమితి, ఏజీ ఆఫీసు, హైదరాబాదు సమర్పణలో ప్రముఖ రచయిత శ్రీ డి.వి. రమణమూర్తి రచించిన ‘వశీకరణం’ అను హస్యనాటికను ఏజీ ఆఫీసులోని ఆరుబయలు రంగస్థల వేదిక మీ 30 జూలై 2012న వరిష్ఠ నటులు శ్రీ ఎం. భజరప్ప దర్శకత్వంలో తమ కార్యాలయ కళాకారులు ప్రదర్శించారు.
ఇందులో సర్వశ్రీ కే.జి. సత్యనారాయణ, నంద్యాల మురళీకృష్ణ, వి. రత్నబాబు, ఎం.వి.ఎస్. సాయి కుమార్, టి. రామారావు, ఎస్. రవికుమార్ మరియు శ్రీమతి సురభి ప్రభావతి నటించారు. శ్రీ ఎం. భాస్కరశర్మ కార్యదర్శి మరియు శ్రీ పి. ధనంజయనాయుడు అధ్యక్షుల పర్యవేక్షణలో ప్రదర్శించిన ఈ హాస్యనాటిక ప్రేక్షకులను ఆద్యంతం అలరించి కడుపుబ్బా నవ్వించింది. ఈ కార్యక్రమంలో ప్రధాన మహాగణకులు శ్రీ కే.ఆర్. శ్రీరామ్, శ్రీమతి వాణీశ్రీరామ్ మరియు ప్రధాన సంచాలకులు డా. సాదు ఇజ్రాయిల్ పాల్గొని కళాకారులను అభినందించారు. ఇంకా, ఉపమాహాగణకులు శ్రీయుతులు టి. మదన్ మోహన్, జీకే పార్థికర్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
డి.వి. రమణమూర్తి మాట్లాడుతూ
స్త్రీ చరణదాసి అన్న కాలం చెల్లిన నీతి ఈ రోజుల్లో పనికిరాదన్న భార్యామణి మొగుణ్ణి కొంగుపట్టుకు తిరిగేలా చేస్తానని శపథం చేసింది.భర్తను కైవసం చేసుకుందామని కోయదొర దగ్గర చూర్ణం తీసుకొని కాఫీలో కలిపి తాగించాబోయింది. ఆ పథకం కాస్త బెడిసికొట్టి ఆమె ఎన్ని పాట్లు పడాల్సి వచ్చిందో ఈ నాటిక చెప్తుంది.
భార్యాభర్తలు అనురాగంతో ఒకరికొకరు వశమైపోవాలిగాని బలవంతపు వశీకరణలు సాధ్యమా! అలాంటి అర్థంలేని ప్రయత్నాలు ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయో ఈ నాటికలో చూసి కాసేపు సరదాగా నవ్వుకుందాం.
'వశీకరణం' నాటిక గురుంచి.....
ఈ నాటిక ఆంధ్రప్రదేశంలోనే గాక కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు కొన్ని వందల ప్రదర్శనలివ్వబడింది. అంతే కాకుండా అమెరికా వంటి పలు దేశాలలో కూడా ప్రదర్శించబడింది. ఇంకా చెప్పాలంటే ఈ నాటిక హిందీలోకి అనువదించబడి భారతీయ రైల్వేల రాజభాష వారోత్సవాల్లో కూడా ప్రదర్శించబడింది.
క్లుప్తంగా చెప్పాలంటే ప్రస్తుతం వివిధ మాధ్యమాలలో ప్రసారమవుతున్న పలు రకాల కార్యక్రమాలకు భిన్నంగా 'నయంతో కూడిన నవ్వు' తెప్పిస్తుంది ఈ నాటిక. అన్నట్టు, ఈ నాటిక మన కార్యాలయంలో కొన్ని సంవత్సరాల క్రితం రెండు మార్లు ప్రదర్శించబడింది.

No videos

Telugu Nataka Samithi Vashikaranam Comedy Drama played at AG Office 3
Telugu Nataka Samithi Vashikaranam Comedy Drama played at AG Office 4
Telugu Nataka Samithi Vashikaranam Comedy Drama played at AG Office
Telugu Nataka Samithi Vashikaranam Comedy Drama played at AG Office 2