Telugu Drama Festivals - తెలుగు డ్రామా ఫెస్టివల్స్ »
Masterji Natakotsavalu Closing Ceremony on 25th June 2012 at Thyagaraya Gana Sabha త్యాగరాయగానసభలో ఘనంగా ముగిసిన మాస్టార్జీ నాటకోత్సవాలు


Plat No.103, Sai Sudhan Apartment, Kalyan Nagar Colony,East Anand Bhagh,
Mobile No: 9346916954

Malkajgiri
Hyderabad
Pin: 500047
Content Text Back to Menu
Masterji Natakotsavalu Closing Ceremony on 25th June 2012 at Thyagaraya Gana Sabha

త్యాగరాయగానసభలో ఘనంగా ముగిసిన మాస్టార్జీ నాటకోత్సవాలు

మాస్టార్జీ షష్ఠిపూర్తి మహోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టి.వి. రంగస్థల అభివృద్ధి సంస్థ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ దళిత కళామండలి సమర్పణ ధాత్రి కళాంజలి – శ్రీ త్యాగరాయగానసభ సంయుక్తంగా నిర్వహించు మాస్టార్జీ నాటకోత్సవాలు 23, 24, 25 జూన్ 2012 తేదిలలో శ్రీ త్యాగరాయగానసభలో జరుగుతున్నాయి. ఇందులో ప్రదర్శించే ప్రతి నాటిక, నాటకం మాస్టార్జీ గారు రచించినవి.

మాస్టార్జీ నాటకోత్సవాలు 25 జూన్ 2012 న శ్రీ త్యాగరాయగానసభలో ఘనంగా ముగిశాయి. ముగింపు ఉత్సవంలో మాస్టార్జీ కి రంగస్థల బిరుదును ప్రదానం చేశారు. ఐఆర్ టిఎస్ ఉత్సవ కమిటి సలహాదారులు రావేల కిశోర్ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖామాత్యులు డా. ఎస్. శైలజానాథ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఐ. పి. ఎస్ బి. ప్రసాద్ రావు, గౌరవ అతిథిగా ప్రముఖ సినీ దర్శకులు తమ్మారెడ్డి భారధ్వాజు లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాస్టార్జీ గారు బి. ఎస్. బాబురావు గారిని, ఉమాశంకర్ గారిని, పల్లె గోపాల్ గారిని, ఎస్. మాధవరావు గారిని ఘనంగా సత్కరించారు. మౌహన్ గాంధి గారు వ్యాఖ్యాతగా వ్యవహరించిన మాస్టార్జీ గారికి శ్రీమతి. జి. శాంత కుమారి గారు వందన సమర్పించారు.

కార్యక్రమంలో మాస్టార్జీ రచించిన నాటికలు, నాటకాలు, నటీనటులు, అధ్బుతంగా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ బి. ప్రసాదరావు, ప్రముఖ సినీదర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజలు ‘మాస్టార్జీ గొప్ప రచయిత, తన రచనలతో సమాజం లో అనేక మార్పులు తీసుకోనివచ్చారని’ కొనియాడారు.

ముగింపు రోజు అనగా 25 జూన్ 2012న డక్కన్ ఆర్ట్స్, హైదరాబాద్ వారిచే “ఎర్ర గబ్బిలం” నాటిక ప్రదర్శన జరిగింది. ఈ నాటికకు దర్శకులు ఆరూరి సుధాకర్, ప్రముఖ ప్రజారచయిత ఉ. సాంబశివరావు విశ్లేషకులు, ముఖ్య అతిథిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉర్దూ యూనివర్సిటి అయిన డా. జి. వి. రత్నాకర్ పాల్గొన్నారు. మరియు శ్రీ వైష్ణవి కల్చరళ్ ఆర్ట్స్ అకాడమి మణికొండ, హైదరబాద్ వారిచే “అంగుళీమాలుడు” నాటక ప్రదర్శన జరిగింది. బెంనడూరి నగరాజారావు, సామాజిక తత్వవేత్త బి. ఎస్. రాములు విశ్లేషకులు.

ఈ కార్యక్రమంలో దైవజ్ఞశర్మ, జీఎస్ బాబురావు, ఉషశ్రీ, పి. శారద తదితరులు పాల్గొన్నారు.

 
Content Photo Gallery Back to Menu
Content Youtube Links Back to Menu
Own Videos Back to Menu
No videos