|
|
Sree Kalanikethan ‘Kodandapani’ Drama Grandly Ended on 30th May 2012 at Ravindra Bharathi రవీంద్రభారతిలో ఘనంగా ముగిసిన ‘కోదండపాణి’ నాటకం
|
|
||||
Sree Kalanikethan ‘Kodandapani’ Drama Grandly Ended on 30th May 2012 at Ravindra Bharathi
రవీంద్రభారతిలో ఘనంగా ముగిసిన ‘కోదండపాణి’ నాటకం
ప్రముఖ రచయిత ఎన్. తారకరామారావు రచించగా, ఆచార్య డిఎస్ మూర్తి దర్శకత్వం వహించిన ‘కోదండపాణి’ (సూర్యవంశపు ధనుస్సు) నాటకాల మూడు రోజుల ప్రదర్శన 30 మే 2012న రవీంద్రభారతిలో ఘనంగా ముగిసింది.
ఈ నాటకాన్ని మూడు రోజులు ప్రదర్శించిన రవీంద్రభారతి ఆడిటోరియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. అంతగా ఈ నాటకం ఆహుతులను ఆకట్టుకుంది. రామకథకు కొత్త కోణాన్ని ఆవిష్కరించి ‘శని’ పాత్రను సృష్టించడం, మండోదరి సుమంగళిగా ఉండాలన్న కోరికను వెలిబుచ్చడం ఈ రెండు పాత్రలను అద్భుతంగా చిత్రికరించడం వలన ప్రేక్షకులను ఈ నాటకం ఆకట్టుకుంది.
చివరి రోజైన 30 మే 2012న కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా
సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ,
సాంస్కృతిక శాఖ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి,
తొలి తెలుగు ‘జ్ఞానపీఠ’ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ జ్యేష్ట పుత్రుడు, సాహితీవేత్త విశ్వనాథ అచ్యుత దేవరాయలు
తదితరులు పాల్గొన్నారు.
ఈ నాటకంలో రామబాణానికి ఉన్న వైశిష్ట్యాన్ని చాటుతూ అదే సమయంలో మొత్తం 30 మంది కళాకారులు తమ పాత్రలను చక్కగా అభినయించారు. రామకథను మూలాన్ని వివరిస్తూ, అదే సమయంలో కొత్త అర్థం, రూపాన్ని చూపిస్తూ శ్రీ కళానికేతన్ కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. రాముడున్నంత కాలం రావణాసురుడు ఉంటాడని, రావణకాష్ఠం కాలుతూనే ఉంటుందన్న సంభాషణలతో నాటకం ముగిసింది.
ఈ సందర్భంగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ
దేశాన్ని ఉర్రూతలూగించే కథ రామకథ, రామాయణం తెలియని వారికి ఈ నాటకంలో కొన్ని ఘట్టాలను ప్రవేశపెట్టి కళాకారులందరూ నాటకంతో నాట్యంతో రక్తి కట్టించారని కొనియాడారు. ఈ నాటకంలో సుందరకాండను అద్భుతంగా ఆవిష్కరించారని పరుచూరి అన్నారు. రామాయణం, మహాభారతం రెండు కళ్ళు అని, అయితే భాగవతం హృదయ నేత్రం అని ఆయన ప్రసంగించారు.
సాంస్కృతిక శాఖ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి మాట్లాడుతూ
నాటకాన్ని ప్రేమించాలని, ఆదరించాలని, ప్రోత్సహించాలని కళాభిమానులకు సలహా ఇచ్చారు.
తొలి తెలుగు ‘జ్ఞానపీఠ’ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ జ్యేష్ట పుత్రుడు, సాహితీవేత్త విశ్వనాథ అచ్యుత దేవరాయలు మాట్లాడుతూ
రామాయణం అంతా శోకమని, ఈ కథను కళాకారులు చక్కగా ఆవిష్కరించారని అన్నారు.

No videos

Sree Kalanikethan Kodandapani Drama Grandly Ended at Ravindra Bharathi
Dr KV Ramana Chary & Writer Paruchuri Gopala Krishna at Sree Kalanikethan Kodandapani Drama at Ravindra Bharathi 2
Sree Kalanikethan Kodandapani Drama Grandly Ended at Ravindra Bharathi 5
Sree Kalanikethan Kodandapani Drama Grandly Ended at Ravindra Bharathi 4
Sree Kalanikethan Kodandapani Drama Grandly Ended at Ravindra Bharathi 6
Sree Kalanikethan Kodandapani Drama Grandly Ended at Ravindra Bharathi 3
Sree Kalanikethan Kodandapani Drama Grandly Ended at Ravindra Bharathi 2
Dr KV Ramana Chary & Writer Paruchuri Gopala Krishna at Sree Kalanikethan Kodandapani Drama at Ravindra Bharathi