Telugu Drama Festivals - తెలుగు డ్రామా ఫెస్టివల్స్ »
‘Trividha’ Telugu Nataka Mahotsavam on 26th May 2012 at Avanigadda, Krishna District అవనిగడ్డ లోని గాంధీక్షేత్రంలో ఘనంగా జరుగుతున్న ‘త్రివిధ తెలుగు నాటక మహోత్సవం’


Gandhi Kshetram,


Avanigadda,
Krishna
Pin: 521121
Content Text Back to Menu
‘Trividha’ Telugu Nataka Mahotsavam on 26th May 2012 at Avanigadda, Krishna District

అవనిగడ్డ లోని గాంధీక్షేత్రంలో ఘనంగా జరుగుతున్న ‘త్రివిధ తెలుగు నాటక మహోత్సవం’


తెలుగు భాషోద్యమ రథసారథి, మాజీ మంత్రి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా గ్రామీణ యువజన వికాస సమితి ఆధ్వర్యంలో ‘త్రివిధ తెలుగు నాటక మహోత్సవం’ 25, 26, 27 మే 2012 తేదీలలో కృష్ణా జిల్లా, అవనిగడ్డ లోని గాంధీక్షేత్రంలో జరుగుతున్నాయి.
 
‘త్రివిధ తెలుగు నాటక మహోత్సవం’లో భాగంగా రెండవ రోజైన 26 మే 2012న సభలో శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా గ్రంథావిష్కరణలు – అంకితోత్సవం ‘వ్యాసమండలి’ కార్యక్రమం జరిగింది.

26 మే 2012న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అధ్యక్షులు మాన్యశ్రీ డా. ఎ. చక్రపాణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సమాచార హక్కు కమీషనర్ మాన్య శ్రీ పి. విజయబాబు ప్రారంభించిన సభకు విశిష్ట అతిథిగా మాన్య శ్రీ కె. పార్థసారథి పాల్గొన్నారు. మహోత్సవంలో భాగంగా జరిగిన గ్రంథావిష్కరణలు – అంకితోత్సవం ‘వ్యాసమండలి’ లో కృష్ణాజిల్లా రచయితల సంఘం అంకిత సమర్పణ చేశారు. దీనికి సంపాదకులు డా. వెలగా వెంకటప్పయ్య. శ్రీ ఆకెళ్ళ రచించిన “స్వర్ణ నందులు” (నంది అవార్డు నాటకాల సంకలనం) గ్రంథం కృష్ణాజిల్లా రచయితల సంఘం కు అంకితోత్సవం ఘనంగా జరిగింది. ఈ గ్రంథాన్ని శ్రీ గంగోత్రి సాయి ప్రచురించారు.

ఈ కార్యక్రమంలో రాత్రి 8 గంటలకు జరిగిన ‘అరవింద ఆర్ట్స్’ తాడేపల్లి వారి ఆకెళ్ళ రచించిన ‘గంగోత్రి’ సాయి దర్శకత్వం వహించిన “మీ ఇల్లెక్కడ..?” నాటకం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది నాటకోత్సవాలలో స్వర్ణ నంది పొందిన నాటకం) ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులు ప్రభుత్వ విప్, ఎం.ఎల్.ఏ, శ్రీ. పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎం.ఎల్.సి. మాజీ మంత్రి శ్రీ. పాలడుగు వెంకట్రావు,  ఎం.ఎల్.సి శ్రీ. ఐలాపురం వెంకయ్య, ఎం.ఎల్.ఏ శ్రీ. డి.వై. దాస్, ఎం.ఎల్.ఏ. శ్రీ. జోగి రమేష్, ఎం.ఎల్.ఏ, శ్రీ. మల్లాది విష్ణు, ఎం.ఎల్.ఏ, శ్రీమతి పద్మ జ్యోతి, ఎం.ఎల్.ఏ. శ్రీ. వెల్లంపల్లి శ్రీనివాస్, ఎం.ఎల్.ఏ. శ్రీ. యలమంచిలి రవి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ. నరహరశెట్టి నరసింహారావు, మాజీ మంత్రి శ్రీ. సంభాని చంద్రశేఖర్, మాజీ మంత్రి శ్రీ దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), మాజీ మంత్రి శ్రీ. పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి, కే.డి.సి.సి. బ్యాంక్ –చైర్మన్ శ్రీ వసంత నాగేశ్వరరావు, డి.సి.ఎం.ఎస్. శ్రీ. కంచి రామారావు, (కృష్ణాజిల్లా) మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ డా. కే. నాగేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ రొండి కృష్ణ యాదవ్,సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కూచిబొట్ల ఆనంద్, శ్రీ ‘ఎమెస్కో’ విజయకుమార్, ‘రైతునేస్తం’సంపాదకులు శ్రీ వై. వెంకటేశ్వరరావు, ‘యుక్త’ లండన్ శ్రీ కిల్లి సత్యప్రసాద్, కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ. గుత్తికొండ సుబ్బారావు, కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రాధన కార్యదర్శి డా. జివి. పూర్ణచందు,పి.ఎస్. రావు హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ శ్రీ. పి.ఎస్. రావు, కళాపోషకులు శ్రీ తొండపు హనుమంతరావు, కిన్నెరా ఆర్ట్ థియేటర్స్ శ్రీ మద్దాలి రఘురాం, కళా ఫౌండేషన్ శ్రీ. సంజయ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.   
 
Content Photo Gallery Back to Menu
Content Youtube Links Back to Menu
Own Videos Back to Menu
No videos