Telugu Drama Festivals - తెలుగు డ్రామా ఫెస్టివల్స్ »
PMKM Fine Arts National Telugu Drama Festival on 16th & 17th April 2012 at Ravindra Bharathi పిఎంకెయం ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ తెలుగు నాటకోత్సవాలు

8-3-225/A/68,
Beside yellamma Temple, Yadagiri Nagar
Mobile No: 9848406129

Yusufguda Check Post, E-Mail: pmkmfinearts@gamail.com,
Hyderabad
Pin: 500045
Content Text Back to Menu
PMKM Fine Arts National Telugu Drama Festival on 16th & 17th April 2012 at Ravindra Bharathi

పిఎంకెయం ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ తెలుగు నాటకోత్సవాలు


ప్రముఖ నట దర్శకులు జె.వి. రమణమూర్తి, పాటిబండ్ల ఆనందరావు లకు రంగస్థల పురస్కారాలు పొలపల మల్లిఖార్జున్ మెమోరియల్ ఫైన్ ఆర్ట్స్ (పిఎంకెయం ఫైన్ ఆర్ట్స్) ఒంగోల్ వారి ఆధ్వర్యంలో 16 ఏప్రిల్ 2012 నుంచి రెండు రోజుల పాటు రవీంద్రభారతిలో రంగస్థల దినోత్సవ జాతీయ తెలుగు నాటకోత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు పసుపులేటి వెంకట రమణ తెలిపారు. కీ.శే. కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ నాటకోత్సవాల్లో 11 కళా సమాజాల వారు వివిధ నాటికలను ప్రదర్శించనున్నారని ఆయన వివరించారు. 11 ఏప్రిల్ 2012 కళాభవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సమన్వయకర్త మద్దాళి రఘురామ్ తో కలిసి ఆయా విశేషాలు వెల్లడించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్.వి. రమణమూర్తి సంబంధిత నాటకోత్సవాల బ్రోచర్ ను ఆవిష్కరించి, నాటకోత్సవాలు జయప్రదం చేయాలని ఆకాంక్షించారు.

16 ఏప్రిల్ 2012 తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు నాటకోత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు సాయంత్రం జరిగే సభా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వట్టి వసంతకుమార్, తోట నరసింహులు, సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్.వి. రమణమూర్తి, సలహాదారు డా.కే.వి. రమణాచారి తదితరులు పాల్గొంటారు.  ఈ సందర్భంగా ప్రముఖ నటులు జె.వి. రమణమూర్తి, నాటక రచయిత దర్శకుడు పాటిబండ్ల ఆనందరావు లను రంగస్థల పురస్కారాలతో సత్కరించనున్నట్లు చెప్పారు. రెండవ రోజు బహుమతి ప్రదానోత్సవంలో రాష్ట్ర మంత్రులు ఎం. మహీధర రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ఆర్.టి.సి. చైర్మన్ బి. ప్రసాదరావు, పూర్వ మంత్రుల మండలి బుద్ధ ప్రసాద్, కే. పుష్పలీల తదితరులు పాల్గొంటారు.

ఎంపికైన ప్రదర్శనలు

ఓ మనిషి ఏది నీ గమ్యం (పద్మాలయ ఆర్ట్స్, భిలాయ్), వధ్యశిల (పావని ఆర్ట్స్, పెదపావని), వృత్త విశ్లేషణం (ప్రవాసాంధ్ర, బెంగుళూరు), స్వరనిది (ఫ్రెండ్స్ కల్చరల్, వరంగల్). అంతాభ్రమ (తపస్వి ఆర్ట్స్, విజయవాడ). నేలమ్మా – నేలమ్మా (నటనాలయ, గుంటూరు) బలి (జానపదం, హైదరాబాద్), లేలేత మొగ్గలు (దాసరి కల్చరల్, హైదరాబాద్), మితాక్షరి (జన చైతన్య, ఒంగోలు), పుష్కరిణి (పండు కొప్పోలు), దిక్సూచి (నాట్యాంజలి, హైదరాబాద్)

నాటికకు లక్ష రూపాయలు

దేశంలోనే తొలిసారిగా నాటికకు లక్ష రూపాయల బహుమతి ఇవ్వనున్నట్లు పసుపులేటి వెంకట రమణ ప్రకటించారు. మొత్తం 123 ఎంట్రీలు రాగా అందులోంచి 32 నాటికలను ఎంపిక చేశారు. మార్చి 23 – 27 వ తేదీ లోపు ఒంగోలులో జరిగిన నాటకోత్సవాల్లో 12 నాటికలను ప్రదర్శించారు. ఈ నెల 16 న రవీంద్రభారతిలో జరిగే నాటకోత్సవాల్లో 10 నాటికలను ప్రదర్శిస్తారు.  అనంతరం ఈ మూడు ప్రాంతాల ఉత్తమ ప్రదర్శనలతో ఢిల్లీ లో అక్టోబర్ 12 నుంచి ఉత్సవాలు జరుగుతాయని పసుపులేటి వెంకటరమణ వివరించారు.

 
Content Photo Gallery Back to Menu
Content Youtube Links Back to Menu
Own Videos Back to Menu
No videos